
ఐవీఎఫ్ ప్రక్రియ కొన్ని చోట్ల వివాదాస్పదమవుతోంది. హరియాణాలో ని గుర్గావ్‌కు చెందిన ఒక జంటకు సంతానం కలగలేదు. దాంతో వారు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించారు. అందులో ఒక సంస్థ వారికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చేయడానికి అంగీకరించింది. ఇందుకోసం ఆ జంట నుంచి అండం, శుక్రకణాల్ని సేకరించారు. అనంతరం ఐవీఎఫ్ విధానంలో ఆ జంట కవల పిల్లల్ని కన్నాది. కొద్దిరోజుల క్రితం పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో వారు ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ జెనెటిక్ పరీక్షలు కూడా అవసమరయ్యాయి. అలా జెనెటిక్, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా సంచలన విషయం బయటపడింది. ఆ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అసలు సంబంధం లేదని తేలింది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి డీఎన్‌ఏతో ఆ పిల్లల డీఎన్‌ఏ మ్యాచ్ కాలేదు. ఆ పిల్లలు తమ పిల్లలే అని సూచించే ఇతర పరీక్షలు నిర్వహించినా ఫలితాలు వారికి వ్యతిరేకంగానే వచ్చాయి. పైగా పుట్టిన పిల్లలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లల్లా ఉన్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై బాధితుడైన రాహుల్ రాథోడ్ ముందుగా ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బయోలాజికల్ పిల్లలు తమకు కావాలని, ఐవీఎఫ్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఐవీఎఫ్ సెంటర్‌పై చర్యకు ఆదేశించింది. అక్కడి రికార్డుల్ని సీజ్ చేయాలంది. ప్రస్తుతం ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో కొనసాగుతున్న ఐవీఎఫ్ సెంటర్ల నిర్వహణా తీరుపై, నైతికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!