Reading Time: < 1 minute

సినిమా చాన్స్ ఇప్పిస్తానంటూ కారులో లైంగిక వేధింపులు..బంజారాహిల్స్ లో నటి ఫిర్యాదు

Caption of Image.

టాలీవుడ్ లో  అవకాశాల పేరుతో ఆశ చూపి, మహిళలను లొంగదీసుకునే క్యాస్టింగ్ కౌచ్ భూతం మరోసారి కలకలం రేపింది. సినిమాల్లో మంచి చాన్స్ ఇప్పిస్తానంటూ ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్.. సినీ నటిని లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్, ఓ సినిమా లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానని బాధితురాలిని నమ్మించాడు. అయితే, షూటింగ్ పూర్తయినప్పటికీ ఆమెకు రావాల్సిన రెమ్యునరేషన్ లేదా డబ్బులను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే, ఓ ప్రముఖ నిర్మాత కార్యాలయానికి రావాలంటూ సదరు నటికి ప్రసాద్ ఫోన్ చేసి పిలిపించాడు.

నిర్మాత ఆఫీస్ దగ్గరకు వెళ్లిన నటిని.. బలవంతంగా తన కార్‌లోకి ఎక్కించుకున్నాడు క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్. ఆ తర్వాత కారులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, సినిమాల్లో ఇంకా పెద్ద అవకాశాలు ఇప్పిస్తానంటూ లైంగికంగా వేధించాడు. ప్రసాద్ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు.. చివరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.  ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.