Reading Time: 2 minutes
Russia Bomber:: గాల్లో ఉండగానే కుప్పకూలిన రష్యన్ యుద్ధ విమానం.. తప్పించుకున్న పైలట్స్.. ఇదిగో వీడియో!

రష్యా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ‘Tu-22M3’ బాంబర్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. సోమవారం ట్రైనింగ్ సేషన్‌లో ఉన్న ఈ విమానం సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, విమానం భూమిని చేరేలోపే అందులో ఉన్న నలుగురు పైలట్లు పారాచూట్ల సహాయంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే దూరం నుంచి ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

వైరల్ వీడియో ప్రకారం.. గాల్లో ఉన్న ఈ విమానం ఓ నది సమీపంలోకి రాగానే సడెన్‌గా కిందకు పడిపోవడం మనం చూడవచ్చు.. అది భూమిని ఢీకొట్టి కాసేపటికే భారీ మొత్తంలో దట్టమైన పొగ పైకి లేవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రమాదంపై అటు రష్యన్ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానం కూలడానికి ముందు అందులో ఉన్న ఫైలెట్లు తప్పించుకున్నారని.. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.

అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి యుద్ధ సామాగ్రి లేదని.. అలాగే విమానం కూలిన ప్రాంతంలో జనసాంద్రత కూడా లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం వంటివి సంభవించలేదని తెలిపింది. విమాన ఇంజన్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని.. ఈ ప్రమాదానిక సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ స్పస్టం చేసింది.

వీడియో చూడండి..

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.