Reading Time: 2 minutes

ఎన్టీఆర్ స్థానంలో సూర్య? నెల్సన్ దిలీప్‌కుమార్ నెక్స్ట్ మూవీపై ఇండస్ట్రీలో హాట్ టాక్!

Caption of Image.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.  ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర 2’,  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

కొద్ది నెలల క్రితం ప్రముఖ నిర్మాత నాగవంశీ ‘జైలర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తమ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నారని ప్రకటించారు. అప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్‌లో హీరోగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.  ఇదిలా ఉంటే, లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 నెల్సన్ తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో కాకుండా తమిళ స్టార్ హీరో సూర్యతో ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ‘సూర్య 50’గా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఆలోచనలో నెల్సన్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని, అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. నెల్సన్ ప్రత్యేకమైన కామెడీ టచ్‌కు సూర్య ఎనర్జీ జతకలిస్తే బాక్సాఫీస్ వద్ద నవ్వుల సునామీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం రజనీకాంత్ తో ‘జైలర్ 2’ పనుల్లో  నెల్సన్ బిజీగా ఉన్నారు. అలాగే మరో భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో ‘సూర్య 50’ సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ షెడ్యూల్ కూడా పూర్తిగా ఫుల్‌గా ఉండటం వల్లే ఈ ప్రాజెక్ట్ సూర్య వైపు మళ్లిందా? లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలపై నెల్సన్, సూర్య, ఎన్టీఆర్ లేదా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ నెల్సన్-సూర్య కాంబినేషన్ నిజమైతే మాత్రం తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు అది భారీ ట్రీట్‌గా మారడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.