Reading Time: 2 minutes
Redmi Turbo 5 Launched With 7540mah Battery 100w Fast Charging Ip69k Rating And Dimensity 8500 Ultra

REDMI Turbo 5 Launched: షియోమీ (Xiaomi) నుండి కొత్తగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ప్రీమియం డిజైన్, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అత్యాధునిక డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది కంపెనీ. ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ ను డిజైన్ చేసారు. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..

1.5K AMOLED డిస్‌ప్లే:

రెడ్ మీ టర్బో 5లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2756 x 1268 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz ఇన్‌స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, 3840Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. M10 ల్యూమినస్ మెటీరియల్‌తో రూపొందించిన ఈ స్క్రీన్ గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉపయోగించారు.

అత్యాధునిక ప్రాసెసర్:

ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ MediaTek Dimensity 8500-Ultra ప్రాసెసర్. 4nm టెక్నాలజీపై తయారైన ఈ చిప్‌సెట్ 20 లక్షలకు పైగా AnTuTu స్కోర్ సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్ కలయికతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా 5300mm² VC కూలింగ్ సిస్టమ్‌తో ఉన్న 3D Ice-Loop కూలింగ్ టెక్నాలజీని కంపెనీ అందించింది. Wildboost ఆప్టిమైజేషన్ గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3తో వస్తోంది. ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల భద్రతా అప్‌డేట్లను కంపెనీ అందించనుంది.

ఫోటోగ్రఫీ:

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను అందించారు. OIS, EIS సపోర్ట్‌తో ఫోటోలు, వీడియోలు మరింత బాగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది 1080p 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Image (1)

భారీ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:

ఈ ఫోన్‌లో 7540mAh భారీ బ్యాటరీని అమర్చారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉండటంతో చాలా తక్కువ సమయంలో ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. అదనంగా 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 100W PPS ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌కు కూడా ఇది అనుకూలంగా పనిచేస్తుంది.

IP69K రేటింగ్స్:

REDMI Turbo 5 మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫోన్ వెనుక కెమెరాల చుట్టూ RGB LED లైటింగ్‌ను అందించారు. దీనిని కంపెనీ REDMI Pixel Matrixగా పిలుస్తోంది. అంతేకాకుండా IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో ఈ ఫోన్ ధూళి, నీరు, అధిక పీడన నీటి జెట్‌ల నుంచి రక్షణ పొందుతుంది. ఇంకా ఇందులో Wi-Fi 7, Bluetooth 6.0, NFC, NavIC, డ్యూయల్ 5G, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్, ఆడియో సపోర్ట్ అందుతుంది.

ధరలు:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే.. 8GB + 256GB వేరియంట్ రూ.37,999, 12GB + 256GB వేరియంట్ రూ.40,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19 నుంచి అమెజాన్, Mi.com, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల కింద SBI, ICICI, Axis బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు తక్షణ డిస్కౌంట్ తోపాటు.. 9 నెలల వరకు నో-కాస్ట్ EMI, 60% వరకు అష్యూర్డ్ బైబ్యాక్ విలువ ఉన్నాయి.