Reading Time: 3 minutes
జూన్ 17 రాశిఫలాలు: ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశుల వారికి శుభవార్తలు

దిన ఫలాలు (జూన్ 17, 2026): మేష రాశి వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృషభ రాశి వారు పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో డబ్బు బాగా ఖర్చవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఉన్నా, సకాలంలో బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలు బాగా సఫలం అవుతాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లే‌ష)

అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల బాధ్యతల్ని పంచుకోవలసి వస్తుంది. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా అను కూల పరిస్థితులుంటాయి. కుటుంబంలో శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొందరు బంధుమిత్రుల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయంతో పోటీగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉండకపోవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొందరు ప్రముఖులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ గురించి ఆలోచనలు సాగిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, వాదనలకు దిగకపోవడం మంచిది. పెళ్లి, ఉద్యోగ, ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థికపరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దాంపత్యంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి ఇతరులకు ఎవరికైనా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అదనపు బాధ్యతల వల్ల ఉద్యోగంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొంత వ్యయ ప్రయాసలకు అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగవద్దు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలో తోబుట్టువులు, బంధువుల నుంచి సానుకూల శుభవార్త వింటారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.