Reading Time: < 1 minute

సిద్దిపేట జిల్లాలో విషాదం.. హైదరాబాద్ వస్తున్న కారు ఎంత పని చేసింది !

Caption of Image.

వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వర్గల్ కమాన్ బస్ స్టాప్ దగ్గర ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఆటో అదుపు తప్పి ముందు వెళుతున్న స్కూటీని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ఒకరు చనిపోయారు. ఆటోలో ఉన్న మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇలా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు పోవడం శోచనీయం.

©️ VIL Media Pvt Ltd.