
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా రాణిస్తున్న విష్ణుప్రియ మరోసారి వివాదంలో చిక్కుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈ భామ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. రూ. 399 చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్ల కోసం విష్ణుప్రియ పోస్ట్ చేస్తున్న కంటెంట్ అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. ఆ వివాదం చల్లారకముందే, లేటెస్ట్ గా మరో బోల్డ్ ప్రకటనతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బాడీ కౌంట్ పై బోల్డ్ కామెంట్..
లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్లతో ప్రత్యేక లైవ్ సెషన్ నిర్వహించిన విష్ణుప్రియ, అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఫాలోవర్ అడిగిన ‘మీ బాడీ కౌంట్ ఎంత?’ అనే ప్రశ్నకు ఆమె నేరుగా స్పందిస్తూ 5 అని చెప్పింది. నిజాయితీగా మాట్లాడుతున్నాం కాబట్టి చెబుతున్నాను అంటూ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#VishnuPriya just 5 ante evaru nammaru.
Enni peggulu vesidho mari pic.twitter.com/yrYbg1k6a1
— P A V A N 😎 | Ambassador 🇮🇳🇮🇳🇮🇳 (@DealsUse) June 15, 2026
యువతను తప్పుదోవపట్టించడమే..
విష్ణుప్రియ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పాలా వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టమని వాదిస్తున్నారు. మరోవైపు మరికొందరు సమాజంలో సెలబ్రిటీలు హాదాలో ఉండి.. ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పడం యువతను తప్పుదోవ పట్టించడమేనని తీవ్రంగా మండిపడుతున్నారు.
►ALSO READ | ప్రధాని మోదీ రీల్స్‌లో ‘AA23’ థీమ్..
ఇదంతా విష్ణప్రియ వ్యూహాత్మక ప్రచారం కావచ్చు అని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి వివాదాలను ఆసరాగా చేసుకుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేసుల తర్వాతే ఆమెకు ఫాలోవర్ల సంఖ్య భారీగా పెంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ ‘బాడీ కౌంట్’ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో.. విష్ణుప్రియ దీనిపై ఇంకేమైనా వివరణ ఇస్తుందో వేచి చూడాలి.