
కోల్కతా: వెస్ట్ బెంగాల్లో ప్రతిపక్ష టీఎంసీ నేతలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల ఎమ్మెల్యేలు మదన్ మిత్రా, కునాల్ ఘోష్, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు సౌమిత్ర బెనర్జీపై దాడి జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా మంగళవారం (జూన్ 16) కోర్టుకు వెళ్తుండగా సౌమిత్ర బెనర్జీపై స్థానికులు కోడి గుడ్లతో దాడి చేశారు. చోర్ చోర్ (దొంగ దొంగ) అంటూ నినాదాలు చేశారు.
పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని రాణిగంజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులను సముదాయించి సౌమిత్ర బెనర్జీని సురక్షితంగా కోర్టుకు తరలించారు. టీఎంసీ నేతలపై వరుస దాడులు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు టీఎంసీ స్పందించలేదు.
►ALSO READ | బర్త్‌డే వేడుకల్లో ఘోరం.. మూడేళ్ల పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిన కేక్.. ఏం మింగాడో తెలుసా ?