
ప్రముఖ టీవీ నటి, ‘ఛావా’ సినిమాలో తారాబాయి పాత్రలో నటించిన 22 ఏళ్ల సంచిత ఉగాలే ఆత్మహత్య కేసులో పోలీసులు తొలి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ముంబై నలసోపరాలోని అచోలే పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాగ్ దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. “అచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల సంచిత మచ్చీంద్ర ఉగాలే తన నివాసంలో కొన్ని కారణాల వల్ల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక మృతి కేసు నమోదు చేశాం. సంచిత మృతికి అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం” అని అధికారి తెలిపారు.
అలాగే, ఇప్పటివరకు ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. అలాగే తన కుమార్తె మరణానికి సంబంధించి ఎవరిపైనా ఎలాంటి అనుమానాలు లేదా ఫిర్యాదులు లేవని సంచిత తండ్రి పేర్కొన్నట్లు ఏపీఐ వినోద్ బాగ్ తెలిపారు. అయితే, ఆదివారం జూన్ 14, 2026న సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే సంచిత ఉగాలే ఆకస్మిక మరణం అభిమానులు, సహనటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం 22 ఏళ్ల వయసులో ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#WATCH | Nalasopara, Maharashtra | API Vinod Bagh of Achole Police Station says, “A case has been reported in the jurisdiction of Acholi Police Station. Miss Sanchita Ugale, 22, died by suicide by hanging herself in her own home… The reason for the death will be determined in… https://t.co/L7JusjMW1g pic.twitter.com/o0AESRpPDO
— ANI (@ANI) June 15, 2026
షాక్‌లో టీవీ ఇండస్ట్రీ.. పలు అనుమానాలు!
ఎంతో యాక్టివ్గా ఉండే సంచిత ఉగాలే (22) ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై లోని నలసోపరాలో ఆమె తన ఇంట్లో విగతజీవిగా కనిపించడంతో అందరు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | OTT Ads: డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ కొనుక్కున్నా యాడ్స్ గోల తప్పట్లే..
కుటుంబ సభ్యులు, సహనటుల వాంగ్మూలాలు సేకరించగా, పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి విచారణ కొనసాగనుంది. సంచితా చివరిసారిగా ఓ రీల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.