
పిల్లలకు ఏ బ్రాండ్ డైపర్లు వాడుతున్నామని కాకుండా… ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఆలోచించాలి. పిల్లలకు డైపర్లు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రం తడి ఆరిపొయ్యేందుకు డైపర్లలో కొన్నిరకాల కెమికల్స్ వాడతారు. దానివల్ల కొందరు పిల్లలకు తరచూ ర్యాషెస్ వస్తుంటాయి. ఇంకొందరికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరు సంప్రదించాలి.
మార్కెట్లో కొన్నిరకాల డైపర్లు చౌకగా దొరుకుతున్నాయి. అవి త్వరగా నానిపోతాయి. దాంతో పిల్లలకు అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే డైపర్లు తడితడిగా ఉంటే పిల్లలకు నిద్రపట్టదు. అందువల్ల నాసిరకానివి కాకుండా నాణ్యమైనవి వాడాలి.
డైపర్ ను ఎక్కువసేపు పిల్లలకు వేసి ఉంచొద్దు. తడిగా అనిపించగానే మార్చేయాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగని కేవలం డైపర్ల వల్ల ఇన్ఫెక్షను రావు. వాటిని సరిగా వాడకపోవడం వల్ల, నాసిరకం డైపర్లు వాడటం వల్లే సమస్యలు వస్తాయి..
కొంతమంది ఇప్పటికీ డైపర్లకు బదులు పిల్లలకు మెత్తని కాటన్ క్లాత్ నే ఉపయోగిస్తారు. అవి చాలా మంచివి. కానీ తడిసిన ప్రతిసారీ వీటిని మారుస్తుండాలి. పిల్లలకు డైపర్ తొడిగే ప్రతిసారీ చాలామంది పౌడర్ అద్దుతారు. అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు రావచ్చు. డైపర్ తీసేయగానే శుభ్రంగా నీళ్లతో కడిగి, పొడిగా తుడిచి నాణ్యమైన డైపర్ లేదా మెత్తని క్లాత్ తో చేసిన లంగోటీలు వాడాలి. అప్పుడు ర్యాషెస్ రావు.
డైపర్ ర్యాషెస్ తగ్గాలంటే..
వెనిగర్: ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. డైపర్ ర్యాష్ నివారించేందుకు మంచి హోం రెమెడీ. ఒక కప్పు నీళ్లలో వేసి బాగా కలపాలి. డైపర్ మార్చిన ప్రతిసారీ ఈ మిశ్రమంతో బేబీ బాటమ్ ప్లేస్ ను శుభ్రంగా తుడవాలి.
►ALSO READ | Vastu tips:చెట్లు తొలగించి ప్రహరీ కట్టొచ్చా.. ఉత్తరం ప్లాట్.. కిచెన్,బెడ్ రూం నిర్మాణం ఎలా ఉండాలి
పెట్రోలియం జెల్లీ : ప్రొటెక్టివ్ లేయర్ గా పనిచేస్తుంది పెట్రోలియం జెల్లీ. యూరిన్ ప్రభావం వల్ల పిల్లల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తేమగా ఉన్న డైపర్ ను తొలగించి బాటమ్ ను గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. పూర్తిగా ఆరాక పెట్రోలియం జెల్లీ రాయాలి.
కొబ్బరి నూనె: ఈ నూనెలోని యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు.. డైపర్ మంటను తగ్గించేందుకు, త్వరగా నయం కావడానికి సాయపడతాయి. కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అందువల్ల అది పిల్లల చర్మాన్ని మరింత మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను డైపర్ ర్యాష్ ఎన్నిసార్లైనా రాయొచ్చు. అలాగే స్నానం చేయించే నీళ్లలో కూడా ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేయడం మంచిది.