Reading Time: < 1 minute

జూన్ 18న జర్నలిస్టుల ‘చలో హైదరాబాద్’

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సోమవారం పేర్కొన్నారు.  

గురువారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని  గన్ పార్క్ నుంచి ఈ నిరసన ర్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

చిన్న, మధ్య తరహా పత్రికల పెండింగ్ అడ్వర్టైజ్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, కేబుల్ టీవీ నిర్వాహకులు కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలని  పిలుపునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.