
న్యూఢిల్లీ:యమ్ బ్రాండ్స్ సంస్థ తన పిజ్జా హట్ వ్యాపారాన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ లాంగ్‌రేంజ్ క్యాపిటల్‌కు 1.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 12,600 కోట్లు) విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. చైనాలోని పిజ్జా హట్ కేంద్రాలను యమ్ చైనా సంస్థ 1.2 బిలియన్ డాలర్లకు విక్రయించనుంది.
ఈ రెండు ఒప్పందాల ద్వారా పన్నుల తర్వాత యమ్ బ్రాండ్స్ సంస్థకు 2.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 19,320 కోట్లు) నికర ఆదాయం లభించనుంది. డొమినోస్ పిజ్జా, డోర్‌డాష్ వంటి యాప్‌ల నుంచి ఎదురైన తీవ్రమైన పోటీ కారణంగా పిజ్జా హట్ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలను చవిచూస్తోంది.
డైన్- ఇన్ ఫార్మాట్ నుంచి డెలివరీ మోడల్‌కు మారడంలో ఆలస్యం కావడం వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఈ విక్రయంతో టాకో బెల్, కేఎఫ్‌సీ బ్రాండ్‌లతో పిజ్జా హట్‌కు దశాబ్దాలుగా ఉన్న సంబంధం ముగిసింది.