Reading Time: < 1 minute
Samantha Nandini Reddy Interview Maa Inti Bangaram Plot Leak Sreemukhi

తాజాగా ఎన్టీవీకీ సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా ఇంటి బంగారం’ యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా అసలు కథ ఏంటి? ఇందులో సమంతతో పాటు ఇతర పాత్రల ప్రాధాన్యత ఏంటనేది సమంత లీక్ చేసేశారు. సమాజంలో ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని లేదా కోడలిని ‘బంగారం’ అని పిలవడానికి అందంగా ఉండాలి, వంట రావాలి, పాటలు పాడాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయని సమంత గుర్తుచేసింది. అయితే తనకు వంట రాదని, అంత మాత్రాన తాను బంగారం కాదా? అని ప్రశ్నించింది.

ఇదే పాయింట్ పై దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మొదటి బంగారం సమంత కాదు.. శ్రీముఖి (అనుసూయ క్యారెక్టర్). ఇంట్లో అందరి అటెన్షన్ ఆమె చుట్టూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు తోటికోడళ్ల మధ్య జరిగే కాంపిటీషన్, ఆమెను రీప్లేస్ చేసి సమంత ఎలా ‘మా ఇంటి బంగారం’గా మారింది అనేదే అసలు కథ” అని రివీల్ చేశారు. సాధారణంగా సమంతకు ఏదీ అంత తొందరగా నచ్చదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. దీనిపై సమంత స్పందిస్తూ.. “నాకు వేరే వాళ్ళ సినిమాలు చూసి నచ్చితే వెంటనే చాలా బాగుందని చెప్పేస్తాను. కానీ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాలో ఒక ‘క్రిటికల్ సమంత’ బయటకు వస్తుంది. ఇది బాలేదు, అది ఇంకా బెటర్ గా చేయాల్సింది అని నా మీద నాకే జడ్జ్‌మెంట్ పోతుంది. కానీ ఈ సినిమా విషయంలో ప్రతిరోజూ షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్ళేటప్పుడు ఒక నటిగా నాకు పూర్తి తృప్తి కలిగింది. 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నా, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే జనాలు బోర్ ఫీలవుతారు. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేసింది.