Reading Time: < 1 minute
Balayya Chiru Venky And Nag Are In The Fray For Dasara Who Will Emerge Victorious

టాలీవుడ్‌లో పండుగ సీజన్ వస్తోందంటే చాలు థియేటర్ల వద్ద హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సమ్మర్ సీజన్  ను వృధా చేసారు స్టార్ హీరోలు. పెద్ది తప్ప మరో పెద్ద సినిమా ఏది రాలేదు. కానీ రాబోయే దసరా పండుగ మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలైన టపాసులు పేల్చడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌ ఒకే రిలీజ్ విండోను టార్గెట్ చేస్తుండటంతో దసరా రేసు ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా సంక్రాంతి బరిలో ఇలాంటి భారీ క్లాష్ చూస్తుంటాం. కానీ ఈసారి దసరా నవరాత్రుల సెలవులను క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలంతా క్యూ కట్టారు. ఈ సీనియర్ యంగ్ స్టార్ల చిత్రాలు గనుక ఒకేసారి బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర సంక్రాంతిని మించిన హంగామా ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్  దసరా రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిల అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లు కూడా ఇదే సీజన్‌ను లీడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఈ నలుగురు స్టార్ హీరోల సినిమాల్లో ఖచ్చితంగా ఎన్ని చిత్రాలు దసరా బరిలో నిలుస్తాయనేది అధికారిక ప్రకటనలు వస్తే గానీ తెలియదు. ఒకవేళ ముగ్గురు లేదా నలుగురు హీరోలు పోటీలో మిగిలినా, ఈ ఏడాది దసరా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద పండుగ క్లాష్‌గా మారడం ఖాయం.