
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం అత్యంత తక్కువ ధరకే విమాన టికెట్లను అందించనున్నట్లు తెలిపింది. దేశీయ విమానాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బేసిక్ ఫర్ ఫ్యామిలీ ఆప్షన్ ప్రవేశపెట్టింది. అయితే ఆఫర్‌లో కాంప్లిమేటరీ భోజన సదుపాయం అందుబాటులో ఉండదు. కేవలం టీ, కాపీ ఫండ్ పానీయాలు మాత్రమే అందిస్తారు. ఈ ఆఫర్ కింద కేవలం ఎకానమీ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది. ఇక దీంతో పాటు వేల్యూ, క్లాసిక్, ఫ్లైక్స్ టికెట్ల ఆప్షన్లను కూడా ప్రయాణికులు ఎంచుకోవచ్చని పేర్కొంది.
ఆ ప్లాన్లు కొనసాగింపు
క్లాసిక్, ఫ్లెక్స్, వేల్యూ ఆప్షన్లు ఎంచుకుంటే కాంప్లిమెంటరీ భోజనంతో పాటు ఇతర ప్రయోజనాలు అన్నీ ఉంటాయని ఎయిరిండియా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని రూట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన చూసిన తర్వాత ఛార్జీల కొనసాగింపు ఉండనుంది. అయితే ఈ చౌక ప్లాన్ ఎంపిక అనేది స్వచ్చంధంగా ఉంటుందని, ప్రయాణికులు తమ నిర్ణయం మేరకు ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపింది. బేసిక్ ఫేర్ ఆప్షన్‌తో పాటు ప్రస్తుతం ఉన్న క్లాసిక్, ఫ్లెకస్, వాల్యూ ప్లాన్లు కొనసాగుతాయని ఎయిరిండియా చెప్పుకొచ్చింది.
ఫుడ్ బుక్ చేసుకోవచ్చు..
బేసిక్ ఫేర్ ఆప్షన్ కింద 15 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీ, 7 కిలోల కేబిన్ బ్యాగేజీ అనుమతి ఉంటుందంది. అయితే ప్లాన్ ఎంచుకున్నవారు విడిగా ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణానికి 24 గంటల్లోపు బుకింగ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఈ బేసిక్ ప్లాన్ కింద వెజ్, నాన్ వెజ్, జైన్, డయాబెటిక్ మీల్స్ అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా స్పష్టం చేసింది.ఎంత చెల్లించాలనే విషయంలో కస్టమర్లకు పూర్తి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ బేసిక్ ఫేర్ ఫ్యామిలీ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇక ఎకాననీ క్లాస్‌లో ప్రయాణించేవారిపై భారాన్ని తగ్గించేందుకు ఈ టికెట్లు ఉపయోగపడతాయని స్పష్టం చేసింది. సామాన్యులకు కూడా విమాన ప్రయాణానికి అందించడంలో ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవాలని సూచించింది.