Reading Time: < 1 minute

మల్కాజిగిరి:16 తులాల బంగారం అప్పగింత…ఆటోడ్రైవర్ ను అభినందించిన పోలీసులు

Caption of Image.

మల్కాజిగిరి, వెలుగు: ఓ ప్రయాణికుడు మర్చిపోయిన 16 తులాల ఆభరణాలున్న బ్యాగును అప్పగించి, నిజాయితీ చాటుకున్నాడు ఆటోడ్రైవర్​జాన్. దమ్మాయిగూడకు చెందిన శ్రీ సంగం సూరిబాబు మంగళవారం ఉదయం మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో రైలు దిగాడు. హడావుడిలో ఆభరణాలున్న తన బ్యాగును స్టేషన్ పరిసరాల్లోనే మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. 

కాసేపటికి గుర్తించి, డయల్100 కు ఫోన్ చేశాడు. వెంటనే మల్కాజిగిరి పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది, క్రైమ్ టీం రైల్వే స్టేషన్‌కు చేరుకొని అక్కడి ఆటోడ్రైవర్లను విచారించారు. ఆ సమయంలో జాన్.. బ్యాగు తన వద్దే ఉందని అప్పగించాడు. ఎస్​హెచ్​వో సత్యనారాయణ అతన్ని అభినందించి, సన్మానించారు. సూరిబాబు జాన్​కు కృతజ్ఞతలు తెలిపాడు.

©️ VIL Media Pvt Ltd.