Reading Time: < 1 minute

అటు సినిమాలు.. ఇటు ఇండిపెండెంట్ మ్యూజిక్.. అరవింద్ పాటతో అదరగొట్టనున్న అనిరుధ్

Caption of Image.

వరుస బ్లాక్‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌ సాంగ్స్‌‌‌‌తో సౌత్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ క్రేజీ మ్యూజిక్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తున్న అనిరుధ్ రవిచందర్.. మరోవైపు ఇండిపెండెంట్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌పై కూడా ఫోకస్‌‌‌‌ పెడుతున్నారు. యూనివర్సల్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ ఇండియాతో కలిసి త‌‌‌‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌‌‌‌ర్కీ రికార్డ్స్‌‌‌‌పై ‘అరవింద్‌‌‌‌’ అనే పాటను విడుదల చేశారు.  

ఒరిజినల్‌‌‌‌ పాప్, హిప్‌‌‌‌ హాప్‌‌‌‌ శైలిలో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌‌‌‌ను ఆకట్టుకుంటోంది.  ‘‘నా పేరు అరవిందు.. మేడ్‌‌‌‌ ఇన్‌‌‌‌ చిన్న సందు.. నేనొక ఇండిపెండెంట్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌..” అంటూ సాగే ఈ పాటకు తెలుగులో శ్రీనివాస మౌళి లిరిక్స్‌‌‌‌ రాశారు. అనిరుధ్‌‌‌‌, డ్యాన్సర్స్‌‌‌‌పై లావిష్‌‌‌‌గా చిత్రీకరించారు.

జానీ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కొరియోగ్రపీ చేశారు. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఓ ఇండిపెండెంట్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌ ఎదుర్కొనే సవాళ్లను ఈ పాటలో చెప్పామని అనిరుధ్‌‌‌‌ తెలియజేశారు. పన్నెండేళ్ల క్రితం చనిపోయిన తన బెస్ట్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ అరవింద్‌‌‌‌ భాస్కరన్‌‌‌‌కు అనిరుధ్‌‌‌‌ ఈ పాటను అంకితం చేశారు.  

©️ VIL Media Pvt Ltd.