
Virat Kohli Craze Reached FIFA World Cup: అమెరికాలో జరుగుతున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026లో కూడా కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రేంజ్ ఏంటో తెలిసే ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీన్ చోటు చేసుకుంది. వరల్డ్ ఫేమస్ యూట్యూబ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్ (IShowSpeed) ఒక లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా.. ఒక ఫ్యాన్ పదే పదే కోహ్లీ గురించి అడిగిన ఒకే ఒక ప్రశ్న స్పీడ్‌కు పిచ్చెక్కించింది. దాంతో విసిగిపోయిన స్పీడ్.. తనదైన స్టైల్ లో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
కోహ్లీ కప్ గెలుస్తాడా బ్రో?:
ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న ఒక నగరంలో ఐషోస్పీడ్ రోడ్డుపై నడుస్తూ ఫ్యాన్స్ మధ్య లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న ఫుట్‌బాల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అందరితో ముచ్చట్లు పెడుతున్న టైమ్‌లో.. గుంపులో ఉన్న ఒక ఫ్యాన్ గట్టిగా అరుస్తూ, ఈజ్ విరాట్ కోహ్లీ విన్నింగ్ ద వరల్డ్ కప్? (విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ గెలుస్తాడా?) అని పదే పదే అడగడం స్టార్ట్ చేశాడు. అయితే, మొదట స్పీడ్ ఆ ప్రశ్నను పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు. కానీ ఆ ఫ్యాన్ మాత్రం అస్సలు తగ్గలేదు.. స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్‌కు అడ్డొచ్చేలా కంటిన్యూస్‌గా అదే క్వశ్చన్‌ను రిపీట్ చేశాడు.
చిరాకుతో ఊగిపోయిన ఐషోస్పీడ్:
ఆ ఫ్యాన్ అడిగిన ప్రశ్నతో లైవ్‌కు డిస్టర్బెన్స్ రావడంతో.. ఐషోస్పీడ్ తన ట్రేడ్‌మార్క్ యానిమేటెడ్ అగ్రెసివ్ స్టైల్‌లో గట్టిగా అరుస్తూ, విరాట్ కోహ్లీ ఈజ్ విన్నింగ్ ద వరల్డ్ కప్! (హా.. విరాట్ కోహ్లీనే వరల్డ్ కప్ గెలుస్తున్నాడు!) అంటూ కోపంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ సీన్ చూడగానే చుట్టూ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో క్రికెట్ పంచాయితీ:
ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అక్కడ జరుగుతోంది ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కాబట్టి.. ఆ ఫ్యాన్ అడిగిన ప్రశ్న వచ్చే ఏడాది (2027) జరగబోయే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (ICC Cricket World Cup 2027) గురించి అయి ఉంటుందని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఇక క్రిస్టియానో రొనాల్డోకి పెద్ద ఫ్యాన్ అయిన ఐషోస్పీడ్‌కు.. గతంలో ఇండియా వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ క్రేజ్ ఏంటో ఆల్రెడీ రుచి చూశాడు. ఇప్పుడు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ వంటి ఒక గ్లోబల్ ఈవెంట్‌లో కూడా కోహ్లీ పేరు ఇలా మారుమోగిపోవడం చూసి కింగ్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ రేంజ్ అన్ స్టాపబుల్ బ్రో అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
IShowSpeed says Virat Kohli is winning the World Cup 😭 pic.twitter.com/clTKaT0xJI
— Speedy Updates (@SpeedUpdates1) June 15, 2026