Reading Time: < 1 minute

గొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి

Caption of Image.

గూడూరు, వెలుగు : అన్నం తింటుండగా గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండలం దామెరవంచ శివారు పిల్లిగుండ్ల తండాలో బుధవారం జరిగింది. ఎస్సై గిరిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్‌‌‌‌‌‌‌‌ బిచ్చు నాయక్ (54) మంగళవారం దుర్గమ్మ పండుగ జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి రాత్రి భోజనం చేస్తుండగా.. అన్నం గొంతులో ఇరుక్కుంది. ఊపిరి ఆడకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి కుమారుడు నరేశ్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.