Reading Time: < 1 minute

అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ పాకిస్తాన్ నాయకత్వ విజయం: ఖవాజా ఆసిఫ్

Caption of Image.

ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్‎కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని బుధవారం ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈ కాల్పుల విరమణ మా నాయకత్వానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. దీనివల్ల తమకు స్థిరత్వం, శాంతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరబ్ దేశాలు, ఇరాన్.. పాకిస్తాన్‌‌పై నమ్మకాన్ని చూపాయని, అమెరికా కూడా తమ వైపు చూస్తోందన్నారు. 

పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పడంపై భారత ప్రధాని మోడీ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఆయన వద్ద ఏమీ మిగలలేదని ఆసిఫ్ ఎద్దేవా చేశారు. మరోవైపు, భారత్ ఈ కాల్పుల విరమణను స్వాగతించింది కానీ పాక్​ పాత్ర గురించి గానీ ఆ దేశం పేరును ప్రస్తావించలేదు. గతేడాది భారత్‌‌తో జరిగిన ఉద్రిక్తతల నుంచి పాకిస్తాన్ చాలా దూరం వచ్చిందని, తాజా పరిణామాల తర్వాత ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు చూస్తోందని ఆసిఫ్  పేర్కొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.