Reading Time: < 1 minute

ఉద్యోగాల కల్పనకు జర్మనీతో తెలంగాణ ఒప్పందం

Caption of Image.
  •     ఇంటర్నేషనల్  ట్యాలెంట్  సమీకరణ, 
  •     మానవ వనరుల అభివృద్ధిలో     ద్వైపాక్షిక సహకారం 
  •     జర్మన్ రాష్ట్ర మంత్రితో ఒప్పంద పత్రాలు మార్చుకున్న మంత్రి వివేక్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగాలు కల్పించే విషయంలో కీలక అడుగు ముందుకు పడింది. జర్మనీలోని నిడర్ సాక్సెన్  రాష్ట్రంతో తెలంగాణ  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్నేషనల్  ట్యాలెంట్  సమీకరణ, మానవ వనరుల అభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా రాష్ట్రం ముందడుగు వేసింది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి వివేక్  వెంకటస్వామి, నిడర్ సాక్సెన్  రాష్ట్ర మంత్రి టన్  మధ్య ఇరు పక్షాల అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కీలక రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరుల డిమాండ్  రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందం ద్వారా నైపుణ్యంగల మానవ వనరుల డిమాండ్ ను తీర్చనున్నారు. 

దీంతో నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరం అవుతాయని ఆ ఇద్దరూ పేర్కొన్నారు. అలాగే, యంగ్  ప్రొఫెషనల్స్ కు అంతర్జాతీయ అనుభవం కల్పించేందుకు ట్రైనీ మొబిలిటీ ప్రోగ్రామ్‌‌‌‌లు నిర్వహించనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పరిశ్రమలకు అనుగుణంగా శిక్షణ విధానాలపై రెండు రాష్ట్రాలు పరస్పరం అనుభవాలను పంచుకోనున్నాయి. దీంతో సంస్థల సామర్థ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే, జర్మన్  ల్యాంగ్వేజ్  శిక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లోయర్ సాక్సోనీ లో ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు భాషా, సాంస్కృతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు చేయనున్నారు.

జర్మనీలో విధానాలపై మంత్రి వివేక్ అధ్యయనం

కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం జర్మనీలోని హానోవర్  నగరంలో చాంబర్  ఆఫ్  స్కిల్డ్  క్రాఫ్ట్స్  హ్యాండ్వర్క్‌‌‌‌స్కామర్  ముఖ్య అధికారులను కలిశారు. దేశవ్యాప్తంగా 53 ప్రాంతీయ చాంబర్లతో కూడిన హెచ్​డబ్ల్యూకే.. క్రాఫ్ట్  వ్యాపారాలు, ఉద్యోగులు, శిక్షణార్థులకు సమన్వయ సంస్థగా పనిచేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి వారి విద్యా శిక్షణ విధానాలు, పనితీరు పద్ధతులు, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపుకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెచ్​డబ్ల్యూకే  క్యాంపస్  సీఈఓ వోల్కర్ ష్మోల్జ్‌‌‌‌తో మంత్రి సమావేశమయ్యారు.

©️ VIL Media Pvt Ltd.