Reading Time: < 1 minute
Ap Petrol Shortage Video Conference Today To Resolve Supply Issues

AP Petrol Shortage: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.. చాలా పెట్రోల్‌ బంక్‌ల దగ్గర నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. అయితే, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పెట్రో కష్టాలు కొనసాగుతున్నాయి.. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు నేడు సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ సభ్యులు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొననున్నారు. అలాగే HPCL, IOC, BPCL సంస్థల ప్రతినిధులు కూడా వీసీకి హాజరుకావనున్నారు.

Read Also: David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్‌ ప్రెస్ మీట్‌లో వార్నర్ ఫైర్!

ఫెడరేషన్ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని బంకుల్లో ఎప్పుడూ పెట్రోల్ అందకపోవడం వల్ల “నో స్టాక్” బోర్డులు పెడుతున్నారని, అలాగే అడ్వాన్స్ చెల్లించినప్పటికీ సరఫరా నిలిపివేయబడుతోందని సివిల్ సప్లయ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనంగా, కొన్ని చోట్ల సడెన్‌గా ఇండెంట్ క్యాన్సిల్ చేయటం వల్ల వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారని గుర్తించారు. కాగా, ఏపీ రాష్ట్రంలో మొత్తం 5,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లయ్ అధికారులు ఆయిల్ సరఫరా సమస్యపై పెట్రోల్‌ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడం, వెంటనే సమస్య పరిష్కరించడం కోసం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ సరఫరా సమస్య తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు ఆశిస్తున్నారు.