Reading Time: 2 minutes
Major Mohit Sharma Ashok Chakra Dhurandhar Real Hero Story

Major Mohit Sharma: ప్రస్తుతం “ధురంధర్: ది రివెంజ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రం భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే పాకిస్థాన్‌లో వణుకు పుట్టించింది. సినిమాను ఆ దేశంలో బ్యాన్ చేసినప్పటికీ జనాలు మాత్రం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రణవీర్ గూఢచారి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు రణవీర్ పాత్ర ప్రయత్నిస్తుంది. అయితే.. ఈ సినిమాలో ధురంధర్ రణవీర్.. కానీ నిజ జీవితంలో మాత్రం అసలైన ధురంధర్ మేజర్ మోహిత్ శర్మ. నేడు మోహిత్ శర్మ వర్ధంతి. ‘ధురందర్‌’ మోహిత్‌ శర్మ బయోపిక్‌ కాదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేసినా.. ఈ సినిమాలోని ఆ పాత్ర మోహిత్‌ శర్మకు దగ్గరగా ఉంటుంది. అసలు ఎవరీ మేజర్ మోహిత్ శర్మ? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

READ MORE: Dhurandhar 2: పాపం…. ధురంధర్ 2 దెబ్బకి వణికిపోతున్న పాక్ లీడర్

దివంగత మేజర్ మోహిత్ శర్మ భారత సైన్యంలోని ఉన్నత శ్రేణి స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన విశిష్ట అధికారి. ధైర్యసాహసాలు, త్యాగాలకు గానూ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర లభించింది. మోహిత్ శర్మ 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించారు. రెండో సంతానమైన మోహిత్‌ను తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ శర్మ, సుశీల శర్మ ముద్దుగా ‘చింటూ’ అని పిలుచుకునేవారు. బడికెళ్లే వయసు నుంచే సైన్యంలో చేరాలనేది రోహిత్ కల. 12వ తరగతి అయిపోగానే ఆయన ఎన్డీఏ ఎగ్జామ్ రాశారు. అదే సమయంలో మహారాష్ట్రలోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సీటు దొరికింది. కానీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో.. ప్రతిష్టాత్మక ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)లో చేరేందుకు మొగ్గు చూపారు. ఇక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) నుంచి ఉత్తీర్ణత సాధించారు. డిసెంబర్ 1999లో అధికారి హోదాలో చేరారు. ఆ తర్వాత అతను 1వ పారా (ప్రత్యేక దళాలు)లో స్వచ్ఛందంగా చేరి, అక్కడ అత్యంత ప్రమాదకరమైన రహస్య కార్యకలాపాలు నిర్వహించాడు. 2004లో ‘ఇఫ్తికార్ భట్’ అనే పేరు గల ఉగ్రవాద గ్రూపుల్లోకి ప్రవేశించి (Undercover), కీలక సమాచారాన్ని సేకరించాడు. కరెక్ట్‌గా ఇదే రోజు. అంటే మార్చిన 21, 2009న కశ్మీర్‌లోని కుప్వారాలో జరిగిన ఒక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ శర్మ ఒక దాడి బృందానికి నాయకత్వం వహించాడు. తీవ్రమైన కాల్పుల మధ్య పలువురు ఉగ్రవాదులను హతమార్చి, తన సహచరులను రక్షించారు. కానీ ఆ ప్రక్రియలో తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.

READ MORE: Luxurious Bicycles: లక్షలు కాదు.. కోట్లు.. అత్యంత ఎక్స్‌పెన్సివ్ 5 సైకిల్స్ ఏవో తెలుసా? బంగారం, వజ్రాలతో తయారీ