Reading Time: < 1 minute
Mamata Banerjee Bjp Comments Ramzan Event Kolkata

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దించి, దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కోల్‌కతాలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రాన్ని , ఇక్కడి ప్రజలను టార్గెట్ చేస్తున్న వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని ఆమె హెచ్చరించారు. “బిజెపి హఠావో.. దేశ్ బచావో” (బీజేపీని తరిమికొట్టండి.. దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

TATA Harrier EV: భారతీయ EV మార్కెట్‌లో కింగ్? టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ QWD 75 విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే

రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే తమ ప్రధాన టార్గెట్ అని ‘దీదీ’ ప్రకటించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, ఐక్యతను కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ కలిసికట్టుగా ఉండి దేశ సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) కీలక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!