Reading Time: 2 minutes
Malaika Arora Dating Harsh Mehta Age Gap Buzz Viral Video Party

Malaika Arora: బాలీవుడ్ స్టార్ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా జరిగిన ఒక వేడుకలో మలైకా తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ హర్ష్ మెహతాతో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన నటి కృతికా కమ్రా – టీవీ హోస్ట్ గౌరవ్ కపూర్‌ల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో మలైకా సందడి చేశారు. అయితే, ఆమె ఒంటరిగా కాకుండా తన రూమర్డ్ ప్రియుడు హర్ష్ మెహతాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. కానీ, అక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

READ ALSO: TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..

కెమెరా కళ్లకు చిక్కకుండా..
ఈ స్టార్-స్టడెడ్ పార్టీలో మలైకా అరోరా ఎప్పటిలాగే తన సిల్వర్ కలర్ స్టైలిష్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ మీద కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే, ఆమె ప్రియుడు హర్ష్ మెహతా మాత్రం మీడియా కంటపడకుండా ఉండటానికి ప్రయత్నించారు. ఆయన మెయిన్ గేట్ నుంచి కాకుండా, బ్యాక్ డోర్ నుంచి వేదికలోకి ప్రవేశించినట్లు సమాచారం. హర్ష్ మెహతా కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అక్కడున్న ఫోటో‌గ్రాఫర్స్ ఆయన్ని వదల్లేదు. వేదిక లోపలికి వేగంగా వెళ్తున్న ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మలైకా – హర్ష్ కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వకపోవడం పట్ల నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఎవరీ హర్ష్ మెహతా?
మలైకా అరోరా గతంలో నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆమె ఒక వజ్రాల వ్యాపారి అయిన హర్ష్ మెహతాతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ గతంలో కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్లలో, ప్రైవేట్ ఈవెంట్లలో కలిసి కనిపించారు. ఇప్పటివరకు మలైకా తన రిలేషన్‌షిప్‌పై అధికారికంగా స్పందించనప్పటికీ, తాజా సంఘటనతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మలైకా అరోరా కొడుకు వయస్సు 23 అయితే, ఆమె రూమర్డ్ లవర్ వయస్సు 33, ఆమె వయస్సు 52 ఏళ్లు.. తన కొడుకు కంటే పదేళ్లు పెద్దవాడితో ఈ బాలీవుడ్ హాట్ భామ డేటింగ్ చేస్తుంది నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది.

READ ALSO: Sanjay Dutt: సంజయ్ దత్ కోసం పాక్ అభిమాని లక్షల విలువైన కానుకలు.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ కావాల్సిందే!