Reading Time: < 1 minute
Anushka Shetty Marriage Rumors Industrialist Wedding 2026

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా, స్టార్ హీరోల అందరి సరసన నటించిన అనుష్క, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ మధ్య ‘ఘాటి’ అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ 44 ఏళ్ల నటి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సర్వం సిద్ధమైందని అంటున్నారు. అయితే వరుడు ఇంకెవరో కాదు, అనుష్క కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలలో ఈ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అంతేకాక, ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..

అయితే ప్రస్తుతానికి అనుష్క సినిమాలు ఏవీ చేయడం లేదు. చాలా కాలం క్రితమే ఒప్పుకున్న ఒక మలయాళ సినిమా మాత్రమే ఆమె చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు గానీ, లేక ఇతర కార్యక్రమాలలో భాగమవుతున్నట్లుగానీ ఎక్కడా అప్‌డేట్ లేదు. కాబట్టి ఆమె నటనకు పూర్తిగా దూరమవుతుందేమో అనే ప్రచారం అయితే ఉంది. నిజానికి ‘ఘాటి’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె బాగా లావుగా ఉందని, ఆమెను గ్రాఫిక్స్‌లో సన్నగా చూపించారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే సినిమాల్లో గ్రాఫిక్స్ కూడా అలానే అనిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదా లేక ఇది కేవలం ప్రచారమా అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేము.