Reading Time: < 1 minute

ధర్మవాణికి తొలిరోజే 54 అర్జీలు..19 అప్లికేషన్లు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరిష్కారం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉద్యోగులు, అర్చకుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘ధర్మవాణి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సోమవారం దేవాదాయ శాఖ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో డైరెక్టర్ హనుమంతరావు స్వయంగా పాల్గొని బాధితుల సమస్యలను విన్నారు.

తొలిరోజు మొత్తం 54 దరఖాస్తులు రాగా, అందులో 19 వినతులను డైరెక్టర్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరిష్కరించారు. గత 11 నెలలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఒక రిటైర్డ్ అర్చకుడి గ్రాట్యుటీ ఫైలును తక్షణమే క్లియర్ చేసి, ఆయనకు ఊరటనిచ్చారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావడంతో అర్చకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.