Reading Time: < 1 minute
Actress Sneha Emotional Interview Accident Memories Karu Palaniappan

తెలుగు తెరపై హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి స్నేహ. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సౌందర్య తర్వాత అంతటి మన్ననలు పొందిన ఈమె, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యారు. పెళ్లి, పిల్లల వల్లే ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారని అందరూ భావించినప్పటికీ, దాని వెనుక ఒక చేదు జ్ఞాపకం దాగి ఉందని తాజాగా ఆమె వెల్లడించారు. ఒక ప్రమాదం తన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో వివరిస్తూ స్నేహ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

స్నేహా మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఒక ఘోర ప్రమాదానికి గురయ్యా. ఆ ప్రమాదంలో నా కాళ్లు, చేతులు,వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం లేచి నిలబడాలన్నా ఎనిమిది నెలలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు తేల్చి చెప్పడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యా. ఇక ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న. కానీ దర్శకుడు కరు పళనియప్పన్ ‘పార్థిబన్ కనవు’ కథతో నను సంప్రదించారు. అసలు కదల్లేని స్థితిలో ఉన్న అని తెలిసి కూడా సినిమా కోసం పిలవడం చూసి ఆశ్చర్యపోయా, కానీ ఆ దర్శకుడు ఇచ్చిన ధైర్యం, చూపించిన నమ్మకమే మళ్ళీ నన్ను కోలుకునేలా చేసింది. ఆ ప్రోత్సాహం వల్లే మళ్ళీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఆమె గుర్తుచేసుకుని స్నేహ ఎమోషనల్ అయ్యారు.