Reading Time: < 1 minute

T20 World Cup Clash: 39 ఏళ్ల తర్వాత వాంఖెడేలో భారత్– ఇంగ్లాండ్ మ్యాచ్.. అప్పుడు ఏ జట్టు గెలిచిందంటే?

Caption of Image.

T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు ఫిబ్రవరి 5వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఆసక్తికర విషయమేమిటంటే, ఇదే వేదికపై 39 సంవత్సరాల క్రితం కూడా ఈ రెండు జట్లు వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో పోటీ పడ్డాయి. 1987లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో ఇండియా– ఇంగ్లాండ్ మధ్య హోరా హోరీగా పోరు జరిగింది. అప్పటికి భారత్ 1983లో టైటిల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. ఇప్పుడు (2026) కూడా భారత్ డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలోనే సెమీస్ ఆడటం విశేషం.

1987లో జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్, కపిల్ దేవ్ ఆడగా, ఇంగ్లాండ్ తరఫున గ్రాహం గూచ్, మైక్ గాటింగ్, అలన్ లాంబ్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. అప్పటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. గూచ్ సెంచరీ, కెప్టెన్ గాటింగ్ హాఫ్ సెంచరీ సాధించారు. టీమిండియా తరఫున మనిందర్ సింగ్ 3 వికెట్లు, కపిల్ దేవ్ 2 వికెట్లు పడగొట్టారు.  లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 219 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో మహ్మద్ అజహరుద్దీన్ ఒక్కడు  మాత్రమే అర్ధశతకం కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎడ్డీ హెమింగ్స్ 4 వికెట్లు, నీల్ ఫోస్టర్ 3 వికెట్లు తీసి 35 పరుగుల తేడాతో విజయం సాధించారు. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈసారి ఏమవుతుంది?: 
1987, 2026 టోర్నమెంట్‌ల మధ్య ఆసక్తికరమైన తేడాలు:  
* భారత్ గత టోర్నమెంట్ లో విజేతగా నిలిచి సెమీస్‌కు చేరింది..
* వాంఖెడే స్టేడియం వేదికగా సెమీఫైనల్ జరిగింది..  
* ఈ టోర్నీలో సెమీస్‌కు ముందు భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది..
* చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా? అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ.. 
 

©️ VIL Media Pvt Ltd.