Reading Time: < 1 minute
Nandamuri Balakrishna Blesses Varalaxmi Sarathkumar Saraswathi Movie

నందమూరి బాలకృష్ణ అంటే కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించే ఒక పెద్ద దిక్కు. తాజాగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరస్వతి’ సినిమా బృందం బాలకృష్ణను కలిసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు సినిమా విశేషాలను వివరించి, ఆయన ఆశీస్సులు అలాగే మద్దతును కోరింది. చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించిన బాలయ్య, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Also Read : Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?

వరలక్ష్మి శరత్‌కుమార్ గతంలో బాలకృష్ణతో కలిసి ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘సరస్వతి’ పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సపోర్ట్ తోడవడంతో ఈ ప్రాజెక్టుకు మరింత బజ్ ఏర్పడింది. ఈ కలయికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.