
భారతదేశం – పాకిస్తాన్ మధ్య అణుయుద్ధంతో సహా ఎనిమిది యుద్ధాలను తానే ఆపానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ఇది కొత్త కానప్పటికీ, తొలిసారిగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను జోక్యం చేసుకోనిపక్షంలో మూడున్నర కోట్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలలలోనే, తాను 8 యుద్ధాలు నివారించినట్లు తెలిపారు.తన రెండో పదవీకాలంలో తొలిసారి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఈ పదినెలల్లో తాను సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. తాను నివారించిన యుద్ధాల జాబితాను వెల్లడిస్తూ, ఇజ్రాయెల్ -హమాస్, ఇజ్రాయెల్ -ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం పాకిస్తాన్, సెర్బియా -కసావో,రువాండా- కాంగో డమోక్రటిక్ రిపబ్లిక్, అర్మేనియా -అజర్ బైజాన్,థాయిలాండ్ -కంబోడియా మధ్య వివాదాలను పరిష్కరించినట్లు ట్రంప్ వివరించారు.
మూడోసారి అధ్యక్షుడిని అయ్యేవాడినేనన్న ట్రంప్
అమెరికా గతంలో కన్నా బలంగా మెరుగ్గా, సంపన్నంగా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థ మునుపు ఎన్నడూ లేనంత వేగంగా దూరుసుకుపోతోందని ఆయన అన్నారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అంటూ, మున్ముందు మరింత అభ్యన్నపథంలో దూసుకు పోతుందని ఆయన చెప్పారు. మూడోసారి అధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రెండో దఫా ప్రెసిడెంట్ పదవి చేపట్టి ఏడాది పూర్తయిందని పేర్కొంటూ, 2020 ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కొద్దిలో విజయం తప్పిపోయిందని గుర్తు చేశారు. అమెరికా రాజ్యాంగం 22 వ సవరణ ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరైనా రెండు సార్లు మాత్రమే బాధ్యతలు వహించవలసి ఉంది. గతంలో కూడా ట్రంప్ మూడో టర్మ్ అధ్యక్ష పదవి చేపట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.