
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కివీస్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్‌లు మంచి ఆరంభాన్నే అందించారు. తొలి వికెట్‌కి 30 పరుగులు జోడించారు. అయితే 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అలెన్ తీక్షణ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే సీఫర్ట్(8) పెవిలియన్ చేరాడు. ఈ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే చమీర బౌలింగ్‌లో ఫిలిప్స్(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్‌లో రవీంద్ర(26), మిచెల్ (0) ఉన్నారు.