
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్‌బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. అయితే చాలా కాలం ఓ ఇన్‌స్టా బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు.. ఆ తర్వాత బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు షణ్ముఖ్ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ అమ్మాయి ముఖం కూడా చూపించకుండా, పేరు చెప్పకండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రం వెల్లడించాడు.
తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తన కూడా ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే తన నిశ్చితార్థం జరిగినట్లు ఫోటోలు షేర్ చేశాడు. ‘‘దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్-వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.