
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తోందని, అభివృద్ధిని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులపై దృష్టి పెట్టిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా సమ్మక్క సారక్క జాతరలో ఫ్రొటోకాల్ అడిగారని, పోలీసులు, అధికారులు ఫ్రొటోకాల్ కల్పించకపోగా పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారని, సిపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదని ఆయన తెలిపారు. ఈ కేసును సిఐడికి ఎందుకు ఇస్తున్నారని, ఈ కేసులో స్కాం ఉందా ? దొంగతనం చేశారా ?
తవ్వి తీసేందుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎందుకు కస్టడీ కావాలని అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించవద్దని ఆయన సూచించారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసిపి, జమ్మికుంట సిఐలను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ఆధారాలతో బయటపెడతానని ఆయన తెలిపారు. రాజకీయాలకు పోలీసులు బలి కావద్దని ఆయన సూచించారు.