Reading Time: < 1 minute

అఫ్గానిస్థాన్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. టి-20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయిన అఫ్గాన్ జట్టు కోచ్ పదవి నుంచి జొనాథన్ ట్రాట్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో రిచర్డ్ పైబస్‌ను నియమిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో శ్రీలంక‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఇంగ్లండ్‌‌కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ఎ మ్యాచ్ ఆడినప్పటికీ.. కోచ్‌గా మంచి అనుభవం ఉంది. 2013 నుంచి 2019 వరకూ అతడు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్నప్పుడే ఆ జట్టు పురుషుల, మహిళల, అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీలు సాధించాయి.