Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ జట్టు ఓటమిపాలైంది. దీంతో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్‌లో ఓటమికి కెప్టెన్ సల్మాన్ అఘానే కారణం అని.. అతడిని అతడి కుటుంబసభ్యులను అభ్యంతరకరంగా దూషిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పాకిస్థాన్‌ కానీ సెమీ ఫైనల్‌కు చేరకుంటే సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో సల్మాన్ అఘా భార్య సబా మంజర్ ట్రోలర్స్‌కు గట్టిగానే జవాబు చెప్పింది. ‘‘పాకిస్థానీ అభిమానులారా.. నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అని తన స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ట్రోల్ చేస్తున్న అభిమానులకు వారికి ఘాటుగా జవాబిచ్చినట్లైంది.