
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు ఈ నోటీుసులు ఇచ్చారు. సోషల్‌మీడియాలో అన్వేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందని అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావవాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.