
టీం ఇండియా ఆటగాడు శిఖర్ ధవన్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. అతడి మాజీ భార్య అయేషా ముఖర్జీతో జరుగుతున్న న్యాయపోరాటంలో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ధవన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరచింది. ఆయేషాకు గతంలో చెల్లించిన రూ.5.72 కోట్లను ితిరి శిఖఱ్ ధవన్ ఖాతాలో జమా చేయాలని తీర్పు ఇచ్చింది. అలాగే ధవన్ కేసు దాఖలు చేసిన రోజు నుంచి ఆ మొత్తానికి 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఆయేషాకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండటంతో గతంలో ఆమె అక్కడి కోర్టులో ప్రాపర్టీ సెటిల్‌మెట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఆ దేశ చట్టాల ప్రకారం విడాకుల తర్వాత భార్య భర్తల మధ్య ఆస్తుల పంపిణీ జరగాలి. ఈ నిబంధన కింద ధవన్ తన మాజీ భార్యకు రూ.5.72 కోట్లు బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు భారత్‌లో చెల్లదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాపర్టీ సెటిల్‌మెంట్ భారత న్యాయ వ్యవస్థకు, ముఖ్యంగా హిందూ వివాహ చట్టానికి పూర్తిగా విరుద్ధమని జస్టిస్ గార్గ్ అన్నారు. దీంతో ఆస్ట్రేలియా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని అన్నారు.