Reading Time: < 1 minute

రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్‌ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్‌తో కర్ణాటక తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కెవి అనీష్‌పై జమ్ము కశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగాడు. దీంతో మ్యాచ్‌లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి జమ్ము కశ్మీర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సీజన్‌లో మొత్తం రాణించిన ఈ జట్టు ఫైనల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. శుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీ చేయగా.. యావెర్ హస్సన్ (88), అబ్దుల్ సమద్ (61) అర్థ శతకాలు సాధించారు. దీంతో రెండో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభం నుంచి బౌలర్లు ప్రశిద్ధ్ కృష్ణ, వైశాక్ విజయ్ కుమార్, విద్యాధర్ పాటిల్‌ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు అదే పనిగా ఫీల్డర్డ స్లెడ్జింగ్ చేయసాగారు.

దీంతోప ప్రశిద్ధ్ కృష్ణ వేసిన 101 ఓవర్‌లో బౌండరీ కొట్టిన తర్వాత షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కెవి అనీష్‌ వైపు దూసుకెళ్లి.. తన హెల్మ్‌ట్‌తో అతడి తలపై కొట్టాడు. దీంతో వాతావరణం హీటెక్కింది. కర్ణాటక సీనియర్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు జోక్యం చేసుకొని గొడవ పెద్దతి కాకుండా ఆటగాళ్లకు సర్ధి చెప్పారు. ఈ విషయంపై కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ మ్యాచ్ రెఫరీకి కంప్లైంట్ చేశాడు.