Reading Time: < 1 minute

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన చక్రస్నానం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.