Reading Time: < 1 minute

భరత్ నగర్: హైదరాబాద్‌లోని మూసాపేట ప్రాంతంలో నడిరోడ్డుపై కత్తులతో వెంటపడి దారుణంగా ఓ వ్యక్తిని చంపేశారు. భరత్ నగర్ బ్రిడ్జి పక్కన శంకర్(48) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు.  మంగళవారం తెల్లవారుజామున నడిరోడ్డుపై కత్తులతో వెంటపడి హత్య చేశారు. వెంటాడి వేటాడి కత్తులతో పొడుస్తుండగా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.