Reading Time: < 1 minute

మన తెలంగాణ/ బోడుప్పల్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలోని పలు పరీక్షా కేంద్రాలను మేడిపల్లి సిఐ ఆర్.గోవిందరెడ్డి సందర్శించి పర్యవేక్షించారు.​పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఉండటం నిషిద్ధమని పేర్కొన్నారు.​కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయం ముగిసే వరకు మూసివేయాలని ఆదేశించారు.​ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం ప్రకటించిన 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ (ఉదయం 9:05 వరకు) నిబంధనను దృష్టిలో ఉంచుకుని, సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.