బఫర్ జోన్‌లోనే భూసేకరణ

మన తెలంగాణ/రాజేంద్రనగర్: మూసీ రివర్ బెడ్ 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో 2012వ సంవత్సరం నుంచి ఎలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం లేదని రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ గండిపేట మండల రెవెన్యూ పరిధిలో ని సుమారు 85.21 ఎకరాల బఫర్ జో న్ సంబంధించిన భూ సేకరణకు గ్రామసభల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు అభిప్రాయాల సేకరణ తీసుకోవడం జరిగిందన్నారు. మూసి రివర్ ఫ్రం ట్ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చట్ట నిబంధనల మేరకే బఫర్ జోన్లలోని భూమిని తీసుకోవడం జరుగుతుందని, అందుకోసం బాధితులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన వెల్లడించారు. మంగళవారం రా జేంద్రనగర్ ఆర్డివో కార్యాలయంలో గండిపేట ఎంఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మీడియాకు పలు అంశాలను వి వరించారు. ఈ సందర్భంగా ఆర్డీ వో వెంకట్ రెడ్డి మూసీ సుందరీకరణలో భాగంగా రాజేంద్రనగర్, గండిపేట మండలంలో మూసీ, ఈసా పరివాక ప్రాంతాల్లో చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కోవలో అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని బాధితులకు సూచించారు. అందరికీ న్యాయం జరిగే విధంగానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి