Reading Time: < 1 minute

‘రామాయణం’లో కైకేయిగా లారా దత్తా.. మందరగా షీబా చద్దా ఫస్ట్ లుక్ విడుదల

Caption of Image.

రణ్‌‌‌‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’.  నితేష్ తివారీ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల దశరథుడి పాత్రను పరిచయం చేసిన మేకర్స్‌‌‌‌.. తాజాగా  కైకేయి, మందర పాత్రలను పరిచయం చేశారు.  శ్రీరాముడి పినతల్లి కైకేయి పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు.  ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ఆమె రాజసం ఉట్టిపడే కాస్ట్యుమ్స్‌‌‌‌,  భారీ ఆభరణాలతో అయోధ్య రాణిగా కనిపించారు.  ఆ పాత్రకు తగ్గట్టుగా కళ్లతోనే భావోద్వేగాలు పలికించారారామె.  

ఇక రామాయణ కథను మలుపు తిప్పే మరో కీలకపాత్ర అయిన మందర  పాత్రను షీబా చద్దా పోషిస్తున్నారు. కళ్లలో  కపటం,  కుట్రపూరిత చూపులతో తన లుక్‌‌‌‌ పాత్రోచితంగా ఉంది. ఇక యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. యశ్‌‌‌‌,  డీఎన్‌‌‌‌ఈజీ సంస్థతో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్‌‌‌‌ దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా రిలీజ్‌‌‌‌ కానుంది.  

©️ VIL Media Pvt Ltd.