ఆస్తమాతో బాధ పడే వాళ్లు అవకాడో చాలా మంచిది. మీరు ఈ జ్యూస్ రూపంలో తీసుకుంటే ఈ ఆస్తమాను నయం చేసుకోవచ్చు. ఇంకా ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోయినా.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే
ఆస్తమా లక్షణాల తీవ్రతను కూడా ఇది తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం: ఈ అవకాడోలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించి, ఇంకా ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది.కాబట్టి మీరు వారంలో రెండు సార్లు తీసుకున్నా చాలు. ఇది ఎక్కువ రేట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది.
జీర్ణ వ్యవస్థ: ఈ అవకాడో ఉండే ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్యను ఇది తగ్గించి అలాగే జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.ఇంకా అవకాడో జ్యూస్ తాగడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, ఆ తరవాత ఆకలి వేయకుండా ఇది అదుపులో ఉంటుంది.
చర్మం, కళ్లు : ఇంకా దీనిలో ఉండే విటమిన్లు (E, C, K), యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని మెరిసేలా చేసి కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు ఉండటం వలన మధుమేహం ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




