Reading Time: < 1 minute

TGSRTC ఎన్నికలు.. ఉప్పల్ జోనల్ వర్క్ షాపులో.. టీడబ్ల్యూయూ (TWU) విజయం

Caption of Image.

టీజీఎస్అర్టీసీ(TGSRTC) గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉప్పల్ జోనల్ వర్క్‌ షాపులో టీడబ్ల్యూయూ (TWU)కూటమి విజయం సాధించింది. మొత్తం 210 ఓట్లకు గాను క్లాస్ 3 లో 94,క్లాస్ 6 లో 90 ఓట్లు రాగా, తెలంగాణ వర్కర్స్ యూనియన్ క్లాస్ 3 లో 110, క్లాస్ 6  లో 113 ఓట్లు వచ్చాయి. టీడబ్ల్యూయూవిజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఆ సంఘం కార్మికులు సంబరాలు జరుపుకున్నారు.

చెంగిచెర్ల డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గెలుపు

చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి ఘన విజయం సాధించింది. క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి 411 ఓట్లు రాగ టీడబ్ల్యూయూ కూటమికి 215 వచ్చాయి. దీంతో 196 ఓట్ల మెజారిటీతో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం సాధించింది. క్లాస్ 6 లో టీఎంయూ కూటమి కి 367 ఓట్లు రాగ టీడబ్ల్యూయూ కూటమికి 255 ఓట్లు లభించాయి. దీంతో 112 ఓట్ల మెజారిటీతో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం సాధించింది.

©️ VIL Media Pvt Ltd.