Reading Time: 2 minutes

సాగుకు సర్కారు సాయం.. 37 యంత్ర పరికరాలకు సబ్సిడీ.. రైతుకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు

Caption of Image.
  • ఎస్సీ,ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీ
  •  లబ్ధిదారుల ఎంపికపై త్వరలో మార్గదర్శకాలు
  •  ఈ ఏడాది బడ్జెట్​ కేటాయింపులు రెట్టింపు

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో యాంత్రీకరణను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, యంత్రాల కొనుగోలులో రైతులకు ఎక్కువ స్వేచ్ఛ కల్పించేలా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం రూ.147.99 కోట్లు కేటాయించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ  భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కోసం రాష్ట్ర సర్కారు ఎదురుచూస్తోంది. మార్గదర్శకాలు అందిన వెంటనే రైతుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి అమలు చేస్తోంది. గత ఏడాది ఈ​పథకానికి రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కేటాయింపులను రూ.147.99 కోట్లకు పెంచారు.

37 రకాల యంత్రపరికరాలపై రాయితీ

గతంలో పరిమితంగా ఉన్న పరికరాల జాబితాను కూడా విస్తరించారు. ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఈ స్కీమ్​ పరిధిలోకి తెచ్చారు. పవర్  టిల్లర్లు, బ్యాటరీ ఆపరేటెడ్  ఎలక్ట్రిక్  టిల్లర్/వీడర్, డిస్క్  ప్లౌ, కల్టివేటర్, లెవలింగ్  బ్లేడ్, రోటావేటర్, రోటో-పుడ్లర్, రివర్సిబుల్ ఎంబీ ప్లౌ, సబ్  సాయిలర్, బండ్  ఫార్మర్, సీడ్-కం-ఫెర్టిలైజర్  డ్రిల్, మల్టీ క్రాప్  ప్లాంటర్, రైజ్డ్ బెడ్  ప్లాంటర్, పోస్ట్ హోల్  డిగ్గర్, ప్లాస్టిక్  మల్చ్  లేయింగ్  మెషీన్, ఫర్టిలైజర్  బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్టర్, రిడ్జ్  ఫరో ప్లాంటర్, ట్రాక్టర్  ఆపరేటెడ్  స్లాషర్, పవర్  వీడర్, మాన్యువల్  నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాక్  స్ప్రేయర్, పవర్  నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాక్  స్ప్రేయర్, ట్రాక్టర్  ఆపరేటెడ్  స్ప్రేయర్, కిసాన్  డ్రోన్, కంబైన్  హార్వెస్టర్, మైజ్  కంబైన్ హార్వెస్టర్, మల్టీ క్రాప్  థ్రెషర్, విన్నోయింగ్  ఫ్యాన్, మైజ్  షెల్లర్, టెలిస్కోపిక్  హార్వెస్టింగ్  పోల్స్, పసుపు బాయిలర్, పసుపు పాలిషర్, ప్యాడీ మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్  కట్టర్  తదితర యంత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. సాగు విధానాల్లో మార్పులకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఆధునిక పరికరాలను కూడా చేర్చే అవకాశం ఉంది.

 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోలతో కస్టమ్  హైరింగ్  సెంటర్లు

ఖరీదైన వ్యవసాయ యంత్రాలను ప్రతి రైతు సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఫార్మర్  ప్రొడ్యూసర్  ఆర్గనైజేషన్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోలు) కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోల ఆధ్వర్యంలో కస్టమ్  హైరింగ్  సెంటర్లు ఏర్పాటు చేసి, యంత్రాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవో ఖరీదైన యంత్రాన్ని కొనుగోలు చేసి, అవసరమైన సమయంలో రైతులకు అద్దెకు అందిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులు యాంత్రీకరణ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

రైతుల అభిప్రాయాలకూ ప్రాధాన్యం

యాంత్రీకరణ పథకాన్ని రైతులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు వారి అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మంగళవారం నిర్వహించనున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో రైతులు, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోల ప్రతినిధులతో వ్యవసాయ యాంత్రీకరణపై అభిప్రాయాలు సేకరించనున్నారు. రైతుల అవసరాలు, సాగులో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతను పరిగణనలోకి తీసుకొని పథకానికి తుది రూపం ఇవ్వనున్నారు. కేంద్ర మార్గదర్శకాలు రాగానే లబ్ధిదారుల ఎంపిక, పరికరాల కొనుగోలు, సబ్సిడీ జమ  ప్రారంభించేందుకు ఏర్పాట్లు 
చేస్తున్నారు.

రైతుకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు

యాంత్రీకరణ పథకంలో ఈసారి రైతులకు మరింత వెసులుబాటు కల్పించనున్నారు. ప్రభుత్వం ఎంప్యానెల్  చేసిన కంపెనీల్లో రైతు తనకు నచ్చిన సంస్థ నుంచి వ్యవసాయ పరికరాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వివిధ కంపెనీల ధరలు, నాణ్యతను పరిశీలించి తనకు అనుకూలమైన పరికరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం రైతుకు ఉంటుంది. యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం సబ్సిడీ, బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందించనున్నారు. సబ్సిడీని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు పథకంలో పారదర్శకత పెరగనుంది.

©️ VIL Media Pvt Ltd.