Reading Time: < 1 minute
Fastest 9000 Runs: కోహ్లీ నుంచి సచిన్  వరకు.. వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే

Fastest 9000 Runs: వన్డే క్రికెట్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని చేరుకోవడం ఏ బ్యాటర్‌కైనా ఎంతో ప్రతిష్టాత్మకం. తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించడం వారి స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం. ఈ జాబితాలో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకున్నారు. ప్రపంచంలోని టాప్-5 ఫాస్టెస్ట్ బ్యాటర్లలో ఏకంగా నలుగురు టీమిండియా దిగ్గజాలే ఉండటం భారత క్రికెట్ రికార్డుల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది.

విరాట్ కోహ్లీ – 194 ఇన్నింగ్స్‌లు

భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 9,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి కేవలం 202 మ్యాచ్‌లు, 194 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్యాయి. నిలకడైన బ్యాటింగ్ తీరు, గొప్ప ఛేజింగ్ స్కిల్స్‌తో విరాట్ ఈ ఆల్-టైమ్ రికార్డులో మొదటి స్థానంలో నిలిచి తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటున్నాడు.

ఏబీ డివిలియర్స్ – 205 ఇన్నింగ్స్‌లు

సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మైదానం నలుమూలలా వినూత్న షాట్లతో విరుచుకుపడే డివిలియర్స్ 214 మ్యాచ్‌లలో 205 ఇన్నింగ్స్‌లు ఆడి 9,000 పరుగుల మార్కును దాటాడు. తన వేగవంతమైన బ్యాటింగ్ శైలితో ఎన్నో మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన ఘనత ఇతనికి ఉంది.

రోహిత్ శర్మ – 217 ఇన్నింగ్స్‌లు

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (హిట్‌మ్యాన్) ఈ రికార్డు జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రోహిత్ 224 మ్యాచ్‌లలో 217 ఇన్నింగ్స్‌లు తీసుకుని ఈ మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రోహిత్ శర్మ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 236 మ్యాచ్‌లలో 228 ఇన్నింగ్స్‌లు ఆడి నాలుగో స్థానంలో నిలిచారు. గంగూలీ 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 242 మ్యాచ్‌లలో 235 ఇన్నింగ్స్‌లు ఆడి ఐదో స్థానంలో నిలిచారు. అప్పట్లో వన్డే క్రికెట్‌లో అతివేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..