Reading Time: < 1 minute

హైదరాబాదీలకు అలర్ట్: 11న ఐటి కారిడార్ లో ట్రాఫిక్ డైవర్షన్..

Caption of Image.

గచ్చిబౌలి, వెలుగు : ఈ నెల 11న ఐటీ కారిడార్​లోని గ్లోబల్​గ్రేస్​క్యాన్సర్​రన్​ను పురస్కరించుకొని ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభమయ్యే రన్​ ఐఐఐటీ జంక్షన్​ మీదుగా విప్రో జంక్షన్​వరకు సాగుతుంది. ఈ సందర్భంగా ఈ రూట్ లో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్​మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్​ట్రాఫిక్​జాయింట్​సీపీ సన్​ప్రీత్​సింగ్​ తెలిపారు. 

డైవర్షన్​ రూట్​ లు ఇవే.. 

విప్రో సర్కిల్​నుంచి ట్రిపుల్​ఐటీ జంక్షన్​ వైపు వచ్చే వాహనాలు విప్రో సర్కిల్​నుంచి నానక్​రాంగూడ, ఓఆర్​ఆర్, గచ్చిబౌలి నుండి వెళ్లాలి. గచ్చిబౌలి, ట్రిపుల్​ఐటీ జంక్షన్​ నుంచి హెచ్​సీయూ, లింగంపల్లి, మజీద్​బండ వైపు వెళ్లే వెహికల్స్​ట్రిపుల్​ఐటీ జంక్షన్​ నుంచి యాంటీ క్లాక్​వైజ్​లో స్టేడియం గేట్​ నెం. 2  వద్దకు చేరుకొని లింగంపల్లి వైపు వెళ్లాలి. 

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు హెచ్​సీయూ డిపో నుంచి మజీద్​బండ, బొటానికల్​గార్డెన్​ జంక్షన్​ మీదుగా గచ్చిబౌలి వెళ్లాలి. ఈ రూట్​లలో రన్​ జరిగే టైంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. 

©️ VIL Media Pvt Ltd.